చర్ల: తాలిపేరు జలాశయానికి వరద నీరు
చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు శనివారం ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. జలాశయం ఎగువ ఛత్తీస్ గఢ్ లోని క్యాచ్ మెంట్ ఏరియాలో కురిసిన వర్షానికి రిజర్వాయర్లోకి 3, 250 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో వచ్చింది. ప్రాజెక్టులో 8 గేట్లను ఎత్తిన అధికారులు 5, 816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.