కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి పట్ల కట్టుబడి ఉందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుణమాఫీ పొందిన లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. మండలాల వారీగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు.