యంగ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్లతో పాటు కళ్యాణ్‌రామ్, వెంకటేష్ తదితరులు సందడి చేశారు. ఈ క్రమంలో వెంకటేష్ ఎన్టీఆర్ చిన్న కొడుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.