చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు శనివారం ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. జలాశయం ఎగువ ఛత్తీస్ గఢ్ లోని క్యాచ్ మెంట్ ఏరియాలో కురిసిన వర్షానికి రిజర్వాయర్లోకి 3, 250 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో వచ్చింది. ప్రాజెక్టులో 8 గేట్లను ఎత్తిన అధికారులు 5, 816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.