భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నారని శనివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు శివ ప్రశాంత్ అన్నారు. కబ్జాకి గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులే కబ్జాధారులపట్ల ఉదాసీనత చూపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కబ్జాదారులను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.