తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సామాజిక, ఆర్థిక సర్వే దుమ్ముగూడెం మండలం, బి కొత్తగూడెం గ్రామ పంచాయతీలో శుక్రవారం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీలోని రెండు ఆవాసాలను బ్లాకులుగా విభజించి సర్వే చేపట్టారు. మొదటి విడతగా గ్రామంలోని కుటుంబాలను లెక్కించి, నవంబర్ 6 తేదీ నుంచి కుటుంబాల పూర్తి సమాచారం సేకరించి, ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేస్తామని పంచాయతీ కార్యదర్శి వంశీ కృష్ణ తెలిపారు.