దుమ్ముగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలను శనివారం పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు గోపాల్ తో కలిసి కార్యదర్శి నాగయ్య శనివారం సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.