భద్రాచలం: ఏనుగుల దాడిలో జనాన్ మృతి
భద్రాచలం పట్టణానికి చెందిన కొంగా సాయి చంద్రరావు అనే జవాన్ ను ఏనుగు తొక్కి చంపింది. గత 10 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో పని చేస్తున్నారు. ఆదివారం ఆర్మీ సిబ్బంది ఆంరీ బారీలో నడుస్తున్నారు. ఒక్కసారిగా వీరిపైకి అడవి ఏనుగుల సమూహం దాడికి యత్నించాయి. రంగపురలో ఈ దాడి జరగగా వాటి నుంచి తప్పించుకునే క్రమంలో చంద్రరావు కింద పడగా ఓ ఏనుగు బలంగా కాళ్ళతో తొక్కడంతో ఆయన స్పాట్లోనే మృతి చెందారు. సోమవారం రాత్రికి చంద్ర రావు మృతదేహన్ని స్వగృహానికి తీసుకురానున్నారు.