ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి పథకం ద్వారా 100% రాయితీపై మంజూరైన ఉచిత చేప పిల్లల పంపిణీ దుమ్ముగూడెం మండల కార్యాలయంలో అందజేశారు. బొచ్చె, రోహు, బంగారు తీగ సంతతికి చెందిన సుమారు 8, 15, 700 చేప పిల్లలను 37 పంచాయతీల్లో ఉన్న 120 చెరువులకు అందజేయడం జరిగిందని వెల్లడించారు.