భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం ఓ పకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐటీడీఏ యూనిట్ అన్నిశాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. అదేవిధంగా గిరిజనులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా తనకు అందజేయాలని అన్నారు. ఉదయం 10: 30కి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.