రామాలయ సరుకుల తనిఖీకి ఏర్పాట్లు

67பார்த்தது
రామాలయ సరుకుల తనిఖీకి ఏర్పాట్లు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అన్నదానంతో పాటు ప్రసాదాల నిమిత్తం వ్యాపారుల నుంచి వచ్చే సరుకులను ఇక నుంచి పక్కాగా తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఈఓ రమాదేవి శనివారం లేఖ రాశారు. ప్రతి నెల ఇక్కడి గోదాములో ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రసాదాల నాణ్యతను సైతం తనిఖీ చేయనున్నారు.

தொடர்புடைய செய்தி