వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేత దర్శించుకున్నారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, ఆలయ అర్చకులు ఉన్నారు.