వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు నేటితో ముగిశాయి. అందులోభాగంగా బుధవారం సద్దుల బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. అందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వాయినంగా పెరుగన్నం, కొబ్బెర, నువ్వులు, పులిహోర, నిమ్మకాయలతో చేసిన వంటలు గోధుమ రొట్టెలు, బెల్లం కలిపి మలీజా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. గైరమ్మ తల్లికి వీడ్కోలు పలుకుతూ మళ్లీ రావమ్మా బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ చెరువులో నిమజ్జనం చేస్తారు.