వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణం నుంచి సోమవారం విజయవాడ కనకదుర్గాదేవి ఆలయం వరకు మహా పాదయాత్ర పట్టణానికి చెందిన టీ. సాయికుమార్ ప్రారంభించాడు. గతంలో కూడా వేములవాడ రాజన్న సన్నిధి నుంచి విజయవాడ వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు. గత తొమ్మిది సంవత్సరాలుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.