వేములవాడ మైనార్టీ సంక్షేమ కళాశాలలో టీజీటీ ఇంగ్లీష్, జీఎఫ్సీ (జనరల్ ఫౌండేషన్ కోర్సు) పోస్టులు ఖాళీ ఉండగా, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. మెరిట్ ఆధారంగా టీజీటీ ఇంగ్లీష్ ఒక పోస్టుకు గాను ఆరుగురిని, జీఎఫ్సీ పోస్టుకు గాను నలుగురిని ఇంటర్వ్యూలకు శనివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించగా, 9మంది హాజరయ్యారు.