రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కొల్లూరి శ్రీనివాస్, దెబ్బేటి ప్రవీణ్, బూర్ల సందీప్ లను నియమిస్తూ శనివారం జిల్లా అధ్యక్షులు బుస్సా దశరథం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుస్సా దశరథం మాట్లాడుతూ ఆదివారం నిర్వహించనున్న ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. నియామకం కాబడిన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.