వేములవాడ-తిప్పాపూర్ వద్ద హై లెవెల్ బ్రిడ్జి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం 6 కోట్ల 96 లక్షల నిధులను మంజూరు చేసి కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 లో ప్రారంభమైన వేములవాడ-తిప్పాపూర్ బస్టాండ్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు భూసేకరణ నిధులు కేటాయించకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయని తెలిపారు.