రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 10 మందికి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వేములవాడ కోర్ట్ శిక్ష విధించింది. కాగా 10మందిలో ముగ్గురికి ఒక రోజు జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు జరిమానా, మిగతా ఏడుగురికి ఒక్కొక్కరికి రూ. 1500/-జరిమానా విధించారు. ఈ సందర్బంగా రూరల్ ఎస్ఐ మారుతీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపకూడదని వాహనదారులకు శనివారం విజ్ఞప్తి చేశారు.