ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 21 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు.