21వ అఖిల భారత పశు గణన – తెలంగాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ 21వ అఖిల భారత పశు గణన – తెలంగాణ గోడ పత్రికని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఆవిష్కరించారు. 21వ అఖిల భారత పశు గణన 25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించబడుతుందనీ, పశు గణన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ (భారత్ పశుదాన్ పోర్టల్ )లో పశు గణన జరుగుతుందనీ అధికారులు వివరించారు.