తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తూ వస్తుంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణను నియమించింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు వారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.