పెద్దపల్లి: పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే

72பார்த்தது
పెద్దపల్లి: పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే
పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. గురువారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు చందపల్లిలో రూ. 35, 60, 000 నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అన్ని వార్డుల్లో పెండింగ్ పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி