నవజాత శిశు యూనిట్ లో అవసరమైన పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ తో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నవజాతు శిశువుల ప్రత్యేక విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు.