ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం రాత్రి శ్రీ సీతారామ చంద్రుల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు తన స్వగృహం నుండి సీతారామచంద్రుల స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.