పచ్చదనం- పరిశుభ్రతే లక్ష్యం

58பார்த்தது
పచ్చదనం- పరిశుభ్రతే లక్ష్యం
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. స్వచ్చ సర్వేక్షన్-2024 స్వచ్ఛత హీసేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్దపల్లిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద శ్రమదానం చేశారు. అలాగే ప్రగతి నగర్ కిషన్ బాగ్ హిందూ స్మశానవాటికలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మినీ ట్యాంక్ బండ్ పై చెత్త, ప్లాస్టిక్ కవర్లను ఏరివేసి మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி