రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, హనుమంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లి, ముత్తారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.