ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు, ఆర్జిదారులు పాల్గొన్నారు.