పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లిలోని ఐటిఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. 6 ట్రేడ్లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటిసి భవన నిర్మాణం, పరికరాల అమరిక పనులు వేగవంతం చేయాలని సూచించారు.