దాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, చిట్టాపూర్, సాతారం గ్రామాల్లో ఐకెపి వారి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాన్యం విక్రయానికి వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.