ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సభ్యత్వ నమోదు

1087பார்த்தது
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సభ్యత్వ నమోదు
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్ధుల సంఘం సభ్యత్వ నమోదును పూర్వ విద్యార్థి అయినటువంటి కోరుట్ల తహశీల్ధార్ నడి మెట్ల సత్యనారాయణ ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అభివృద్ధిలో నడిపేందుకు తమ వంతుగా పూర్వ విద్యార్థులందరూ కలిసి సహాయ సహకారాలు అందించాలని, అభివృద్ధిలో ముందుండేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెన్న విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి బూర్ల నరేష్, కోశాధికారి మనోజ్ కుమార్, కోటగిరి ప్రసాద్, ముక్క చిన్న ధర్మరాజు, అధ్యాపకులు జయప్రసాద్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி