జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా వైద్యాధికారి డా. సమీయొద్దీన్, ఐఎంఎ అధ్యక్షులు జి. హేమంత్, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్, కోశాధికారి డా. సుధీర్ కుమార్ పాల్గొన్నారు.