జగిత్యాల జిల్లాలో స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు జిల్లా కేంద్రంలొని దేవి శ్రీ ఫంక్షన్ హాల్లో బుధవారం బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 233 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు పాల్గొన్నారు.