జగిత్యాల పట్టణ మున్సిపల్ లో పారిశుద్ధ్య కార్మికుల అక్రమ నియామకాలు జరిగాయని 35 వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డికి కలెక్టరేట్ లో ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రస్తుత పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత కార్మికుల సంఖ్య 215 ఉండగా, 2021 లో పట్టణ సమాఖ్య ద్వారా 30 మంది కార్మికులను నియమించారని వివరించారు.