జగిత్యాల రూరల్ మండలం అంతర్గంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ కల్లుగీత కార్మికులకు మంజూరైన 10 లక్షల విలువగల 100 కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డా. చంద్ర శేఖర్ గౌడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాయిబాబా గౌడ సంఘం నాయకులు బాలు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.