జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రెచపల్లి గ్రామానికి చెందిన వెంకట సాయికి మంజూరైన 10వేలు, లత కి 19 వేల రూపాయల సిఎం సహాయ నిధి చెక్కులను, పోతారం గ్రామానికి చెందిన పెద్ద గంగారాం కి మంజూరైన 7500 రూపాయల సిఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, మాజీ సర్పంచ్ నారాయణ రావు, కౌన్సిలర్ కూతురు రాజేష్ పాల్గొన్నారు.