హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో మంగళవారం విద్యుత్ స్తంభాలు, విద్యుత్ మీటర్స్ రూరల్ ఏఈ జనార్దన్ తనిఖీలు చేసి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్ ఉండాలి లేని ఇంటికి రూపాయలు 938 కే అందజేస్తామని చెప్పారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ లైన్ ఇనస్పెక్టర్, లైన్ మెన్, మరియు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.