మల్యాల మండలం రామన్నపేట, రాంపూర్, ఓబులాపూర్, మద్దుట్ల గ్రామాల్లో నిర్వహిస్తున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు బూత్ల స్థానిక నాయకులతో కలిసి సభ్యత్వాలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వారి వెంట మండల బీజేపీ నాయకులు, పలువురు ఉన్నారు.