మత్స్యకారుల ఆర్థికాభివృద్ది కోసం వంద శాతం సబ్సిడీపై జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో 1,41,85,589 చేప పిల్లలను విడుదల చేయడానికి లక్ష్యం పెట్టుకున్నామని కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. గురువారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీకాంత్, ఆర్డీఓ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఇంచార్జి ఎంపీడీఓ అతినారపు ప్రకాష్ తో కలిసి చేప పిల్లలు విడుదల చేసారు.