ఇటీవల డీఎస్సీలో ఎంపికై ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, ఎల్లారెడ్డి ఎంఈఓ ఎవి. వెంకటేశం అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో నూతనంగా నియామకమైన, 23 ఎస్జీటీ, 9 స్కూల్ అసిస్టెంట్ లు 32 మంది ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. నూతన ఉపాధ్యాయులు విద్యార్థులకు సరియైన రీతిలో కృత్యాదారా రీతిలో, అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు.