ఎల్లారెడ్డి మున్సిపల్ ని పలు వార్డులో నిర్మాణం అవుతున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కలిసి సోమవారం పరిశీలించారు. పట్టణంలోని 8, 9, 10వ వార్డుల పరిధిలో సిసి రోడ్డు పనుల నాణ్యత పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఏఈ శ్రీకాంత్, కౌన్సిలర్ అల్లం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, పోచయ్య, సుభాష్ తదితరులు ఉన్నారు