అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన జుక్కల్ నియోజకవర్గంలోని పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. సుమారు 165మంది లబ్దిదారులకు చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.