వరి ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని జహీరాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ బీబీ. పాటిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన రైతుపోరుయాత్రలో పాల్గొని మాట్లాడుతూ. గత నెలరోజుల నుండి వరి కోతలు ప్రారంభమైన ఇప్పటివరకు ఎలాంటి వరి ధ్యానం కొనుగోలు చేపట్ట లేదని, ప్రభుత్వం కేవలం వడ్ల సెంటర్లు ప్రారంభానికి మాత్రమే పరిమితమైందన్నారు.