పురుగుల మందు తాగి ఓవృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెదలో జరిగింది. ఎస్ఐ. మల్లారెడ్డి కథనం ప్రకారం మాల్తుమ్మెదకు చెందిన వదల్పర్తి రత్నయ్య(61)మూడేళ్లుగా పనిచేతకాక ఇంటివద్దనే ఉంటూ మానసికంగా కృంగిపోయి పురుగుల మందు సేవించాడు. అతన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
,