తెలంగాణ అధికార పర్యటనలో భాగంగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం) లో పాల్గొనేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెళ్లారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా వారి పర్యటన సాగనుంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు వీరికి లండన్ లో సోమవారం ఘన స్వాగతం పలికారు.