తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియుసీ బాన్సువాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బాన్సువాడ సహాయ కార్మికశాఖ కార్యాలయంలో శుక్రవారం జూనియర్ అసిస్టెంట్ షేక్. దావూద్కు వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు డి. రాములు మాట్లాడుతూ.. బిచ్కుంద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పటల్లో పనిచేస్తున్న పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులను కాంట్రాక్టర్ తొలగించడం సరికాదన్నారు.