జుక్కల్లోని సెగ్మెంట్ కౌలాస్ నాలా ప్రాజెక్టులో ఇన్ ఫ్లో తగ్గడంతో బుధవారం ప్రాజెక్టు తెరిచిన గేట్లు మూసి వేసినట్లు ఏఈఈ రవి తెలిపారు. ప్రాజెక్టు జలాశయంలోకి 180 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో, ప్రధాన కాల్వ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458. 00 అడుగులు కాగా 457. 95 అడుగుల నీరు మెయింటైన్ అవుతుందన్నారు.