జుక్కల్ సెగ్మెంట్ లోని నిజాం కాలం నాటి "ఎన్"ఆకారంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు మంజీరనది ద్వారా ఇంకా కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 12, 150 క్యూసెక్కుల నీరు గురువారం ఉదయం వరకు ఇన్ ఫ్లో గా వస్తుంది. ప్రాజెక్టు జలాశయంలో 1404. 92 అడుగుల నీటిని మెయింటైన్ చేస్తూ, 12, 500 క్యూసెక్కుల నీరు 3వరద గేట్ల ద్వారా దిగువ మంజీర ద్వారా గోదావరిలోకి వెళ్తుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.