నేడు కందకుర్తికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కందకుర్తి త్రివేణి సంగమం వద్ద జరిగే గోదావరి హారతి కార్యక్రమంలో ఆదివారం పాల్గొననున్నట్లు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు త్రివేణి సంగమం పుష్కర ఘాట్ వద్ద గోదావరి హారతి అనంతరం కందకుర్తిలో డాక్టర్ జి ఎగ్డేవార్ పూర్వికుల స్థలంలో నిర్మిస్తున్న డాక్టర్ కేశవరామ్, బలిరామ్ ఎగ్డేవార్ స్ఫూర్తి కేంద్రాల పనులను పరిశీలించనున్నారు.