విద్యార్థులకు విద్యతో పాటు లైఫ్ స్కిల్ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయోలా హైస్కూల్ లో మంగళవారం విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. కుట్టు శిక్షణ, పులా అల్లకం, ఇంటిలో చేసుకునే వంటలు, చేతి వృత్తుల పై అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపాల్ సురేష్, శోభ, ఇంచార్జ్లు శంకర్, గంగామణి, ఉపాధ్యాయులు అనిత, మీనాక్షి, పద్మ, లావణ్య, రేకా, సుజాత స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.