బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నవీపేట్ మండలంలోని నాగేపూర్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. వందల కోట్ల రూపాయల సిఎంఆర్ బియ్యాన్ని రైస్ మిల్లులకు అందించి కమిషన్లు తీసుకొని సివిల్ సప్లై శాఖకు అప్పులే మిగిల్చిండని, ఆ శాఖకు 1000 కోట్లు అందించి కొనుగోలు ప్రారంభించామని అన్నారు.